Tuesday, November 26, 2024

సోషల్ మీడియాకి.. నజ్రియా బ్రేక్

షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది హీరోయిన్ న‌జ్రియా. ఈ భామ సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టీవగా ఉంటూ తన భర్తకు సబంధించిన విషయాలను సోషల్ మీడియాలో రకరకాల విషయాలు పంచుకుంటుంది. కాగా సోషల్‌ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట ఈ బ్యూటీ. నెట్టింట్లో నుంచి బయటకు రావాలని ఆమె డిసిషన్ తీసుకున్నట్టు సమాచారం. . ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్టులో.. తను అనుకున్న పాయింట్స్ ను వివరంగా చెప్పింది. నేను నా అన్ని సోషల్‌ మీడియా ఖాతాల ప్లాట్ ఫామ్స్ నుంచి బ్రేక్‌ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ, సందేశాలను చాలా మిస్‌ అవుతాను. నేను మళ్లీ తిరిగి వస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను అని పేర్కొన్నారు. దాంతో ఆమె ఫ్యాన్స్ డిస్సాయింట్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement