శోభితా ధూళిపాళ్ల.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సినిమాలు, వెబ్ సిరీసులతో ఆకట్టుకుంటోంది. ఏపీ తెనాలి ముద్దుగుమ్మ అయిన శోభిత.. హాలీవుడ్ లో కూడా ఛాన్సులు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఆమె ఇంగ్లీష్ డెబ్యూ మూవీ మంకీ మ్యాన్.. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఇన్ స్టాలో డైలీ అప్డేట్స్ ఇస్తూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. క్రేజీ ఔట్ ఫిట్స్ లో నెటిజన్లకు కిక్కిచ్చే పోజులు ఇస్తుంటోంది. రకరకాల స్టిల్స్ తో కుర్రకారును మైమరపిస్తుంటోంది. స్విమ్ సూట్ వేసుకున్న శోభిత.. సైకిల్ తొక్కుతున్నట్లు పోజు ఇచ్చింది. ఓర చూపుతో అట్రాక్ట్ చేస్తోంది. థైస్ షోతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. మ్యాగ్ జైన్ బ్యానర్ పేజీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వైజాగ్ టూ లాస్ ఏంజిల్స్.. విన్నింగ్ స్ట్రీక్ లో శోభిత అంటూ క్యాప్షన్ ఇచ్చారు GQ India నిర్వాహకులు. శోభిత అందానికి నెట్టింట సెగలు పుడుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. థైస్ షోకు క్లీన్ బౌల్డ్ అయ్యామని అంటున్నారు. ఎండల వేడికి శోభిత అందాల వేడి తోడు అయిందని చెబుతున్నారు. GQ India పోస్ట్ ను రీ షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. గ్లామర్ గేట్లు ఎత్తేసి ఫిదా చేస్తోందని సందడి చేస్తున్నారు.