Saturday, November 23, 2024

బాయ్ ఫ్రేండ్ తో డేటింగ్..తల్లి కాబోతున్న ఫ్రిదా పింటో..

స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ బ్యూటీ ఫ్రిదా పింటో పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. కోరీ ట్రాన్‌, ఫ్రిదా పింటో 2017 నుంచి డేటింగ్‌ చేసుకుంటున్నారు. వీరి ప్రేమను పెళ్లి పీటలెక్కించాలనుకున్న ఈ లవ్‌ బర్డ్స్‌ 2019లో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ పెళ్లి డేట్‌ మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె గర్భవతినన్న విషయాన్ని చెప్పడంతో సెలబ్రిటీలు, అభిమానులు ఫ్రిదాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాను గర్భవతినన్న విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే బుల్లి ట్రాన్‌ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

కాగా ఇటీవ‌లి కాలంలో చాలా మంది అందాల భామ‌లు పెళ్లి కాకుండానే త‌ల్లి ప్ర‌మోష‌న్ అందుకుంటున్నారు.ఆ మ‌ధ్య అమీ జాక్సన్ కూడా పెళ్లి చేసుకుండానే త‌ల్లి అయింది. ఫ్రిదా కెరీర్‌ విషయానికి వస్తే ఆమె ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘ఇమ్మోర్టల్స్‌’, ‘రైజ్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌’ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ‘బ్రిటన్స్‌ వరల్డ్‌ వార్‌ 2’ తోపాటు ‘స్పై ప్రిన్సెస్‌: ద లైఫ్‌ ఆఫ్‌ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌’ చిత్రాల్లో ​కీలక పాత్రలు పోషిస్తోంది. ‘స్పై ప్రినెన్స్‌’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

ఇది కూడా చదవండిhttp://మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ @లూసిఫర్ రీమేక్

Advertisement

తాజా వార్తలు

Advertisement