ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన లేటె్స్ట్ మూవీ ‘స్కంద. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చని ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక రామ్ కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ‘స్కంద’ మూవీకి రావడం విశేషం. కాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తొంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్టు సమాచారం.
అంతే కాకుండా.. ‘స్కంద’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27వ తేదీన ‘స్కంద’ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.