టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన యాక్టింగ్ తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.తాజాగా “ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ మంచి విజయాన్ని అందుకున్నారు..ఫాంటసీ మూవీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ మరియు కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో సందీప్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.ఇప్పటికే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ‘వైబ్’ అనే సినిమాను మొదలు పెట్టిన సందీప్ తాజాగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చారు. గతేడాది మాస్ మహారాజ్ రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్‌కిషన్ తాజాగా తన 30వ సినిమాను ప్రారంభించాడు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ మంగళవారం హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ క్లాప్ ఇవ్వగా , విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. SK30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి రాజేశ్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.