Saturday, November 23, 2024

Sivakarthikeyan | గుడ్ న్యూస్ చెప్పిన శివకార్తికేయన్.. మూడో బిడ్డకు తండ్రైనట్లు వెల్లడి

తమిళ హీరో శివకార్తికేయన్.. తాజాగా తన ఫ్యాన్స్‌తో హ్యాపీ న్యూస్ షేర్ చేసుకున్నాడు. తాజాగా తన భార్య ఆర్తీకి మగబిడ్డ పుట్టినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. తను మూడోసారి తండ్రి అయిన విషయం సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.

‘‘జూన్ 2న పుట్టిన మా బేబీ బాయ్‌ను చూసి మా మనసులు నిండిపోయాయి. మా ఫ్యామిలీ మరింత పెద్దగా అవ్వడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పటిలాగానే మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, సపోర్ట్ మాకు కావాలి’’ అంటూ తన ఫ్యామిలీ తరపున ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు శివకార్తికేయన్. దీంతో తన ఫ్యాన్స్ అంతా ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement