Sunday, September 8, 2024

Sitar | ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ నుంచి మెలోడీ సాంగ్…

YouTube video

తెలుగు సినిమాల్లో ఈమధ్య అచ్చమైన తెలుగు పాటలు వచ్చి చాలా కాలమైంది. ఇక అప్పుడప్పుడు కొందరు దర్శకులు మాత్రమే మన కమ్మని తెలుగు పదాలకు సినిమాలో స్పెస్ ఇస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ఆయన రూపొందిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి ‘సితార్’ అనే పాటను అచ్చమైన తెలుగు మెలోడీ గా విడుదల చేశారు. ఇటీవల సితార్ సాంగ్ ప్రోమో విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక నేడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.

గేయ రచయిత సాహితి ఈ పాటకు లిరిక్స్‌కు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సాకేత్, సమీర గానం ఈ పాటకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ పాటను వింటుంటే చాలా రోజుల తరువాత ఒక పూర్తి తెలుగు పాటను విన్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు . ఇక సాంగ్‌లో రవితేజ, భాగ్యశ్రీ మధ్యలో ఉన్న కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉందీ రొమాంటిక్ మెలోడీలో వారు వేసిన స్టెప్పులు మ్యూజిక్ కు తగ్గట్టుగా ఉన్నాయి. హరీష్ శంకర్ తన ప్రత్యేక శైలిలో పాటను ఫైనలైజ్ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక సితార్ సాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోయే మెలోడీగా నిలుస్తుందనే ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement