కరోనా వైరస్ ధాటికి మరో ప్రముఖుడు కన్నుమూశాడు. ప్రముఖ సితార్ విద్వాంసుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవబ్రత చౌదరి (85) మృతిచెందారు. తన తండ్రి మరణించినట్టు ఆయన కుమారుడు ప్రతీక్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేవబ్రత చౌదరికి ఇటీవల కరోనా పాజిటివ్ తేలగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఆక్సిజన్ స్థాయి శుక్రవారం ఒక్కసారిగా పడిపోయింది. దీంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. శనివారం గుండెపోటు రావడంతో దేవబ్రత మృతి చెందారు. సంగీత ప్రపంచానికి పండిత్ దేవబ్రత చౌదరి అరవై ఏళ్ల పాటు విశేష సేవలందించారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఆయన మృతికి కేంద్ర సాంస్కృతిక శాఖ సంతాపం ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement