సితార ఎంటర్-టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (వాతి). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు- ప్రేక్షకుల మెప్పు పొందు తోంది. తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభను నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకు న్నారు. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ము ఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి, నటీ-నటు-లు సంయుక్త మీనన్, సు మంత్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భర ణి, హైపర్ ఆది తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకను ప్రారంభించే ముందు ఇటీ-వల స్వర్గస్తులైన సినీ నటు-డు నందమూరి తారకరత్నకు నివాళులు అర్పిస్తూ చిత్ర బృందం కొద్దిసేపు మౌనం పాటించారు.
ముఖ్య అతిథి ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ ”ముందుగా ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమా లు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండి పోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు. హాలీవు డ్ యాక్టర్ సిడ్నీ పోయి టియర్ నటించిన టు- సర్, విత్ లవ్, ఎన్టీ రామారావు గారి బడిపంతులు, హృతి క్ రోషన్ నటించిన సూప ర్ 30 లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్.” అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలో భాగ స్వా మ్యమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.” ఇలా వీళ్లు అం దరూ కలిస్తేనే ఈరోజు ఈ సక్సెస్.” అని ఆయన పేర్కొన్నారు. చిత్ర కథానాయిక సంయుక్త మీనన్, నటు-డు సుమంత్, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, సముద్రఖని, హైపర్ ఆది తదితరులు ప్రసంగించారు. ఈ సినిమాలో విద్యార్థులుగా నటించి అలరించిన పిల్లలతో ఈ వేడుకకు ప్రారంభించడం విశేషం. అలాగే ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మూర్తి తో కలిసి మూవీ టీ-మ్ కేక్ కట్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.