ప్రముఖ సింగర్ స్మిత గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆమె పాటలతో కోట్లాది మంది అభిమానుల మన్ననలు పొందింది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసిన స్మిత సెకండ్ వేవ్ సమయంలో కూడా తన వంతు సహాయం చేయటానికి ముందుకు వచ్చింది. అయితే సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ సరఫరాతో కూడిన పడకలు సమీకరించే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు స్మిత. దీని ద్వారా క్లిష్టమైన దశలో ఉన్న కరోనా రోగులకు ఆసుపత్రులలోని ఐసియూ పడకలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 ప్రదేశాలలో “EOAPforOOPIRI” పేరుతో నిధుల సేకరణ మరియు వనరులను సమీకరించడంలో మాతో చేరండి అని ఏపీ ఈఓ సభ్యులను అభ్యర్థించారు. ఈఓ ఏపీ సభ్యులు మరియు అలై ఫౌండేషన్ సహకారంతో అతి తక్కువ సమయంలో 300 ఆక్సిజన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక అయితే ఈ లక్ష్యాన్ని అధిగమించి రోగుల అవసరాలను తీర్చడానికి 600ల ఆక్సీజన్ సెటప్స్‌ను ఏర్పాటు చేయనుంది.
విజయవాడలో సుజనా ఫౌండేషన్ 100 పడకలతోస్టెప్-డౌన్ ఆసుపత్రిని నిర్మించారు. దానిని GGH, కేర్ ఫౌండేషన్ నుండి కలెక్టర్ మరియు వైద్యుల బృందం సహకారంతో 200 ఆక్సిజన్ పడకలకు పెంచే దిశగా పనిచేసింది. తాత్కాలిక అవసరం ఉన్న రోగులందరికీ ఇది ఉచిత సౌకర్యం అని తెలియజేసారు. అలాగే హైదరాబాద్‌లో సైబరాబాద్ పోలీస్ వారితో కలిసి పోలీసు కమిషనర్ సజ్జనార్ గారు మరియు మెడికోవర్ నాయకత్వంలో 50 పడకలను ఆక్సిజన్ సరఫరాతో నడపడానికి సహకరించాము. అలాగూ వెస్ట్‌గోదావరి, అనంతపురం జిల్లాలలో EO సహకారంతో ఇదే విధంగా 50 పడకలను ఆక్సిజన్ సరఫరాతో నడపనున్నాము. శ్రీకాకులం, వైజాగ్‌లో 150 పడకలు ఆక్సీజన్ సహకారంతో ఏర్పాటు చేయనున్నాము.
ఈ సదుపాయాలన్నీ ఆక్సిజన్ అవసరం రోగులకు అత్యవసర సహాయాన్ని అందిస్తాయి. ఈ వేవ్ తగ్గే వరకు ఈ మద్దతును ఇలాగే కొనసాగించనున్నారు. కోవిడ్ సంరక్షణ కింద రోగులకు హెల్ప్‌లైన్లను రూపొందించడానికి స్మిత వ్యక్తిగతంగా చొరవ తీసుకుని స్మితాకేర్ & అలై ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. మీ నిజమైన కోవిడ్ సంరక్షణ అభ్యర్థనల టెలిఫోన్ సంప్రదింపుల కోసం ట్విట్టర్‌లో #SmitaCare హ్యాష్‌ట్యాగ్ జత చేయండని తెలిపారు స్మిత