తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇన్‌బాక్స్‌లోకి కొంతమంది మగాళ్లు కావాలనే వారి ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు షేర్ చేస్తున్నారని, దీనిపై కంప్లెయింట్ చేసినందుకు తన ఇన్‌స్టా గ్రామ్‌ని బ్లాక్ చేశారని తెలిపింది సింగర్ చిన్మయి. కాగా, విమెన్స్‌పై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో కానీ, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయాన్ని కానీ చాలా సీరియస్‌గా తీసుకున్నారు చిన్మయి. దీనిపై జరిగిన పోరాటంలో ముందుండి పోరాటం సాగిస్తున్నారు.
అంతకుముందు తమిళ సినీ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి #METOO ఉద్యమానికి ప్రోత్సాహం అందించారు సింగర్ చిన్మయి శ్రీపాద. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మరో సమస్యతో వార్తల్లోకెక్కారు. తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కు కొందరు పురుషులు తమ మర్మాంగాల ఫొటోలు పంపారని, వారు తమ ప్రైవేటు పార్ట్ ఫొటోలను నేరుగా తన ఇన్ బాక్స్ కే మెసేజ్ చేశారని తెలిపారు. ఇది కొన్నాళ్లుగా జరుగుతోందని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
కాగా, దీనిపై కంప్లెయింట్ చేయగానే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రాథమికంగా సస్పెండ్ చేశారని చిన్మయి పేర్కొన్నారు. ప్రస్తుతం @chinmayai.sripada అనే బ్యాకప్ అకౌంట్ తో తాను యాక్టివ్‌గా ఉన్నట్టు తెలిపారు. ఈ తాత్కాలిక అకౌంట్ ద్వారానే చిన్మయి తన ఆవేదనను వెలిబుచ్చారు. అయితే.. తనకు అసభ్య ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్నవారి అకౌంట్లు అలాగే ఉంచి, కంప్లెయింట్ చేసిన తన అకౌంట్ ను సస్పెన్షన్‌లో ఉంచడాన్ని తప్పుపట్టారు చిన్మయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.