నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు సిద్దార్థ్. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు సిద్దార్థ్. అయితే తాజాగా ఓ నెటీజన్ సిద్ధార్థ్ ను ట్యాగ్ చేస్తూ… 40 ఏళ్ల పైబడిన సిద్దార్థ్ తో 20 సంవత్సరాల హీరోయిన్లు నటిస్తే వల్లమాలిన ప్రేమ, ముద్దుల ఈమోజీలు ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ ట్వీట్ చేశాడు.
అయితే దీనిపై సిద్దార్థ్ వెంటనే స్పందిస్తూ…. హీరోల వయసు టాపిక్ లో ఫస్ట్ నేనే గుర్తు వచ్చనారా? ట్యాగ్ కూడా చేసావ్… సూపర్ రా దరిద్రమ్… ఎక్కడినుంచి వస్తారా మీ లాంటోళ్లు అంటూ ట్వీట్ చేశాడు. మరో నెటీజన్ సిద్దార్థ్ ను ట్యాగ్ చేస్తూ.. మరో ట్వీట్ చేశాడు.నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మెట్స్ అంట కాదాఅంటూ…దానికి కూడా సమాధానం ఇచ్చారు సిద్దార్థ్. ఆయన నా దత్తపుత్రుడు. నేను మోహన్ బాబు గారు క్లాస్ మెట్స్ ముందు నిజాలు తెలుసుకో అంటూ సమాధానమిచ్చాడు.