Saturday, November 23, 2024

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాప్ సింగర్

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పండంటి మగబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని స్వయంగా శ్రేయానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చానని తెలిపింది. ”ఆ దేవుడి ఆశీర్వాదంతో పండంటి మ‌గ‌బిడ్డ పుట్టాడు. నేను, శైలాదిత్య‌, కుటుంబ స‌భ్యులం అంద‌రం చాలా చాలా సంతోషంగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేని ఫీలింగ్ ఇది. మా చిన్నారికి ఆశీర్వాదాలు పంపిన మీ అంద‌రికీ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు” అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఇది చూసి కంగ్రాట్స్ అంటూ పెద్దఎత్తున నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు, తమిళ, హిందీతోపాటు అనే బాషాల్లో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శ్రేయా ఘోషల్.. తన స్నేహితుడు, బిజినెస్‌మెన్ శైలాదిత్య‌ను 2015 సంవత్సరంలో శ్రేయా ఘోషల్ పెళ్లాడింది. వివాహం తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న శ్రేయా.. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ పలువురి ప్రశంసలందుకుంటోంది. ఇటీవలే ‘ఉప్పెన’ మూవీలో ఆమె పాడిన ”జల జల పాతం నువ్వు..” సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement