Tuesday, December 3, 2024

Tripti Dimri : టాప్ హీరోయిన్స్ కు షాక్ లు… దిమ్రి వెంట‌బ‌డుతున్న ద‌ర్శ‌కులు

రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్‌’లో ఘాటైన సన్నివేశాల్లో జీవించిన ట్రిప్తి దిమ్రి ఆ తర్వాత కెరీర్ బెస్ట్ ప్రాజెక్టుకు కమిటవుతోంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ట్రిప్తి బిజీ అయిన సంగతి తెలిసిందే. పలు ఫ్రాంఛైజీ చిత్రాల్లో సీక్వెల్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ జాన్వి కపూర్, కియారా అద్వానీ లాంటి క్రేజీ భామల అవకాశాలకు గండి కొట్టింది.

ట్రిప్తీ దిమ్రీ ‘బ్యాడ్ న్యూజ్‌’లో విక్కీ కౌషల్, అమ్మీ విర్క్‌లతో కలిసి కనిపిస్తుంది. ఈ చిత్రంలో అనన్య పాండే అతిధి పాత్రలో కనిపిస్తుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 19న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కథాంశం పూర్తిగా కాంప్లికేటెడ్. దీనిలో ఇద్దరు వేర్వేరు మగవారి వీర్యంతో కవలలకు గర్భవతి అయ్యే యువతి కథాంశమిది.

- Advertisement -

కార్తీక్ ఆర్యన్ తో భూల్ భులయా 3లో కియరా అద్వాణీ నటించాల్సి ఉండగా.. ట్రిప్తీతో రీప్లేస్ చేసారు. భూల్ భూయయ్య 3 లో విద్యాబాలన్ కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. మాధురి దీక్షిత్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక ప్రదర్శనలో కనిపిస్తుంది.

జాన్వీ కపూర్ నటించిన ధడక్ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. నవంబర్ 22 న ధడక్ 2 థియేటర్లలో విడుదల కానున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించారు. ధడక్ లో జాన్వి కపూర్, ఇషాన్ ఖాటర్ నటించగా, ధడక్ 2 లో ట్రిప్తి డిమ్రీ – సిద్ధంత్ చతుర్వేది జంటగా నటిస్తున్నారు. ఒరిజినల్ ధడక్ తరహాలోనే మధ్యతరగతి రిచ్ క్లాస్ నడుమ ప్రేమాయణాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఈ చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. జాన్వీ నటించాల్సిన సినిమాలో ట్రిప్తీకి అవకాశం దక్కింది.
రాజ్‌కుమ్మర్ రావు ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా’ చిత్రంలో ట్రిప్తి అవకాశం అందుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 11 న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ షాండిలియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కామెడీ-డ్రామా అని చెబుతున్నారు.
కార్తీక్ ఆర్యన్‌తో ట్రిప్తి దిమ్రీ రెండవ చిత్రం ఆషిఖి3. అయితే ఈ చిత్రం టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement