మహానటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ అమ్మడు తెలుగు లో పెద్దగా సినిమాలు చేయడం లేదు. తమిళనాట మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. ఇదే సమయంలో హిందీలో కూడా ఈ అమ్మడికి ఆఫర్లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో వరుణ్ దావన్ కి జోడీగా కీర్తి సురేష్ ఒక సినిమాలో నటిస్తోంది.
ఆ సినిమా కంటే ముందే అజయ్ దేవగన్ తో కలిసి ‘మైదాన్’ సినిమాలో కీర్తి సురేష్ నటించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో కీర్తి సురేష్ ను కాదనుకుని ప్రియమణి తో మైదాన్ మేకర్స్ షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా మైదాన్ ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు అమిత్ శర్మ మాట్లాడుతూ… మైదాన్ సినిమాలో అబ్దుల్ రహీమ్ పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు. ఆయన భార్య పాత్ర లో కీర్తి సురేష్ ను అనుకున్నాం.
ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాం. అందుకే కీర్తి సురేష్ తో చేయించాలని అనుకున్నాం. ఆ సమయంలో కీర్తి సురేష్ చాలా బరువు తగ్గి సన్నగా మారడంతో ఆ పాత్రకు సెట్ కాలేదు. దాంతో మేము ప్రియమణితో కలిసి ఈ సినిమాను చేశామని ఆయన పేర్కొన్నాడు. మైదాన్ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అజయ్ దేవగన్ వంటి బడా స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశంను బరువు తగ్గడం వల్ల కోల్పోవడం కీర్తి సురేష్ కు పెద్ద నష్టం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా హిందీలో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.