Friday, September 20, 2024

Stree 2 | క‌ల్కీ, ఫైట‌ర్ మూవీల‌కు షాక్..

బాలీవుడ్ భామ శ్ర‌ద్దా క‌పూర్ , రాజ్ కుమార్ రావు కాంబినేషన్‌లో వచ్చిన తాజా సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ ‘స్త్రీ 2’ . అమర్‌ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌లైంది. ఓపెనింగ్‌ డేన సూపర్ హిట్‌ మౌత్‌ టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతూ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

స్త్రీ 2 ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. ఫైటర్‌, కల్కి 2898 ఏడీ (హిందీ) ఓపెనింగ్ డేన రూ.22-24 కోట్లు వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు ఏకంగా డబుల్ మార్జిన్‌తో ఈ ఫిగర్‌ను స్త్రీ 2 ఓవర్‌టేక్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది.బాలీవుడ్‌లో 2024లో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలువడమే కాదు..ఆల్ టాప్‌ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో స్త్రీ 2 స్థానం సంపాదించింది.

ఫస్ట్‌ డేనే రూ.47 కోట్ల కలెక్షన్లతో హీరోలు కూడా సాధించని అరుదైన ఫీట్‌ నమోదు చేసి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది శ్రద్దాకపూర్‌. పెయిడ్ ప్రివ్యూస్‌ కలుపుకుంటే స్త్రీ 2 ఇండియావ్యాప్తంగా రూ.55 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం. ఫస్ట్ లుక్‌, ట్రైల‌ర్‌కు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంలో కీ రోల్‌ పోషించాయని చెప్పాలి. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్రల్లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement