అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు.. అదనపు షోలు, పెంచిన టిక్కెట్ రేట్లను రద్దు చేయాలని కోరింది. దీంతో తాజాగా కోర్టు ఆదేశాల మేరకు గేమ్ ఛేంజర్ సినిమాకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అలాగే భవిష్యత్ లోనూ తెల్లవారుజామున ప్రత్యేక షోలు వేసేందుకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
దీంతో తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమాకు షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.