కర్లీ హెయిర్ తో గుండె గిల్లుతుంది శోభిత. ఈ అందమైన తెలుగమ్మాయి కీర్తి విశ్వవిఖ్యాతం అయింది. సైలెంటుగా ప్రతిభతో దూసుకుపోతోంది తెనాలమ్మాయ్. గూఢచారి, మేజర్, ది నైట్ మేనేజర్, మేడ్ ఇన్ హెవెన్.. ఇలా వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో విషయం ఉన్న పాత్రలతో మెప్పించిన శోభిత తదుపరి హాలీవుడ్ సినిమా ‘మంకీ మ్యాన్’లో కనిపించనుంది. ఈ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ కథానాయకుడిగా నటించాడు. మూవీ త్వరలో విడుదలకు రానుంది.
ఈ సందర్భంగా తన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శోభిత మరోవైపు వరుస ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. తాజాగా శోభిత షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ యువతరం గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఈ ఫోటోషూట్ కి ప్రత్యేకించి థీమ్ ఉంది. ఎంచుకున్న థీమ్ కి తగ్గట్టే శోభిత డార్క్ మోడ్ లో రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది. మధ్యాహ్న సూర్యుడు కర్లీ హెయిర్ స్పైసీ లంచ్… అంటూ ట్యాగ్ ని జోడించి ఈ అందమైన ఫోటోషూట్ ని శోభిత షేర్ చేసింది. పింక్ టైట్ టాప్ ధరించిన శోభిత, ప్రయోగాత్మక బాటమ్ లైన్ తో మెరిపిస్తోంది. తన కర్లీ హెయిర్ స్టైల్ అంతే కవ్విస్తోంది.