Friday, October 18, 2024

Shivathmika | బ్లాక్ శారీలో దొర‌సాని…

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ తో కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. దొరసాని సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక, ఆ సినిమాలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో జోడీ కట్టింది. మూవీ కమర్షియల్ గా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోయినా, శివాత్మిక తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ముఖ్యంగా ఆమె ఎక్స్ప్రెషన్స్‌కు యూత్ ఫిదా అయిపోయారు. రంగమార్తాండలో నెగిటివ్ షేడ్ ఉన్న కూతురు పాత్రలో నటించింది. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. సినిమాకు పెద్ద సక్సెస్ రాలేదు కానీ శివాత్మిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

తన లక్ష్యం స్టార్ హీరోయిన్ కావడం అని స్పష్టం చేసిన శివాత్మిక, విలక్షణమైన కథలలో మాత్రమే నటించేందుకు మొగ్గు చూపుతోంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా శివాత్మిక తన సోషల్ మీడియా యాక్టివిటీస్‌ వల్ల మంచి క్రేజ్ పొందుతోంది.

లేటెస్ట్ ఫోటోషూట్స్, స్టైలిష్ పిక్స్ షేర్ చేస్తూ, నెటిజన్లను ఫిదా చేస్తోంది. ముఖ్యంగా ఆమె షేర్ చేస్తున్న శారీలో ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. నల్లని చీరలో ఇటీవల షేర్ చేసిన ఫోటోలలో అమ్మడు అద్దంలో చూస్తూ వయ్యారంగా కనిపించింది. బ్లౌజ్ డిజైన్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement