Tuesday, November 26, 2024

షార్ట్ ఫిల్మ్స్ పేరుతో పోర్న్ చిత్రాల నిర్మాణం..

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఫోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే రాజ్ కుంద్రా షార్ట్ ఫిల్మ్ ల పేరుతో నీలి చిత్రాలు తీసేవాడని తెలుస్తోంది. సినిమా రంగంపై మక్కువ ఉన్న న‌టీన‌టుల‌తో ఫోర్న్ వీడియోలు తీయించి వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసేవారని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన త‌ర్వాత‌.. వాటిని వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా విదేశాల‌కు ఆ కామెంట్‌ను పంపిస్తారు. అయితే భార‌తీయ చ‌ట్టాల నుంచి త‌ప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాల‌ను అక్క‌డి యాప్స్‌లో అప్‌లోడ్ చేయించేవారట.

ఇక ఈ నిర్మాణ సంస్థలో కామత్ అనే డైరెక్టర్ వీటిని దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది. ఇతడు వియాన్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా చేశావాడట. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను 8 అశ్లీల చిత్రాల‌ను డైర‌క్ట్ చేశాడు. సినిమాల్లో ఛాన్సు ఇస్తామ‌ని చెప్పి.. ఔత్సాహిక హీరోయిన్ల‌ను పోర్న్ చిత్రాల వైపు మ‌ళ్లించేవాడు. త‌న్వీర్‌ పోర్న్ వీడియోలు షూట్ చేస్తున్న‌ట్లు విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్ కామ‌త్ ద్వారా ఆ వీడియోల‌ను బ్రిట‌న్‌లోని కెర్నిన్ లిమిటెడ్ కంపెనీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసేవాడు.

ఇక వీడియోలను అప్ లోడ్ చేేసేటప్పుుడు పక్కా ప్లానింగ్ తో పని పూర్తి చేసేవారట..విదేశీ ఐపీ అడ్ర‌స్‌ల ద్వారా పోర్న్ వీడియోల‌ను అప్‌లోడ్ చేసేవాళ్లు. హాట్‌షాట్‌, న్యూఫ్లిక్స్‌, హాట్‌హిట్‌, ఎస్కేప్‌నౌ.టీవీ లాంటి అప్లికేష‌న్స్‌ను వాడేవారు. కానీ ప‌క్కా ఆధారాలు దొరికిన త‌ర్వాత‌నే కుంద్రాను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. పోర్న్ వీడియోలు షూట్ చేసేందుకు వాడిన సుమారు 6 ల‌క్ష‌ల విలువైన‌ ప‌రిక‌రాల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఐపీసీలోని 420 (చీటింగ్‌), 34 (కామ‌న్ ఇంటెన్ష‌న్‌), 292 and 293 (అశ్లీల చిత్రాల మేకింగ్‌) సెక్ష‌న్ల కింద కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి : రామ్ లింగుస్వామి సినిమా సెట్ లో సీనియర్ దర్శకుడి పుట్టినరోజు వేడుకలు

Advertisement

తాజా వార్తలు

Advertisement