హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య తో తీసిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒకప్పటి మద్రాస్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. కథకు అనుగుణంగానే ధనుష్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభించాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను నారాయణదాసు నారంగ్, పుష్కుర్ రామ్మోహన్ లు నిర్మిస్తున్నారు.