Monday, November 18, 2024

సారంగదరియా వివాదంపై శేఖర్ కమ్ముల రియాక్షన్ !!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా కు సంబంధించిన సారంగదరియా సాంగ్ పై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది.. ఈ నేపథ్యంలోనే గేయరచయిత సుద్దాల అశోక్ తేజ శేఖర్ కమ్ముల పై రకరకాల విమర్శలు వస్తున్నాయి. జానపద గాయని కోమలి పాట ను వాడుకొని క్రెడిట్ ఆమెకు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు నెటిజన్లు. క్రెడిట్ మొత్తం ఆమెకు ఇవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ వివాదం పై శేఖర్ కమ్ముల స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ని పెట్టారు.

చాలా ఏళ్ళ కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి ‘సారంగ దరియా’ అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ విజువ‌లైజ్ చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా మైండ్‌లో తిరుగుతూనే ఉంది.

నా ఫ‌స్ట్ ఫిల్మ్ డాల‌ర్ డ్రీమ్స్‌లో లక్కీ అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్‌లో యూజ్ చేసినందుకు SONY company కి నేను డ‌బ్బులు చెల్లించాను. ఫిల్మ్ లో క్రెడిట్స్ కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’ లో లక్కీ అలితో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్ లో సుబ్బల‌క్ష్మి గారి పాట నుంచి ఫిదాలో మల్లీశ్వరి సినిమాలోని అప్పగింతల పాట వరకు స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒకో సినిమా కి ఒకో పాట తిరుగుతుంటుంది. love story ఫిల్మ్ కి నా మనసులో ఈ పాట ఉంది.

సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని ఫిల్మ్‌కి అనుకూలంగా రాయాలి అంటే, ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాటకి అంత బాగా లిరిక్స్ రాసినందుకు చాలా హ్యాప్పీగా ఫీల‌య్యాను. మా టీంలో ఒకరు శిరీష ఫోన్ నెంబ‌ర్ సంపాదించి ఆమెని కాంటాక్ట్ చేశారు. అప్పటికి త‌న‌కు డెలివ‌రీ టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. క‌రోనా వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యింది. ప‌సికందు ప‌ట్టుకుని ఉండే శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు. ఈ పాటని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగ‌ర్ పాడిన వెర్ష‌న్‌తోనే. ఫిబ్ర‌వ‌రిఆఖరులో మంగ్లితో పాడించాం. ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ‘ఇద్దరు సింగ‌ర్స్ ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని’. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం మెంబ‌ర్ ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను.

ఈలోగా ఆయన వివరాలు సేకరించి, ‘ఆ ఇద్దరిలో కొమలే ఆ పాటని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం’ అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. ‘పాట రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేసాం కాబట్టి, కోమలని వెంటనే రమ్మని’ అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని చెన్నయ్ నుంచి రప్పించాం. ‘జలుబు ఉంది, రాలేను’ అంది కోమల. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది. జెన్యూన్ కేస్ సార్.. పాట‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అని సుద్దాల గారు అన్నారు. కోమలని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను. ఆడియో ఫంక్ష‌న్‌లో పాడమని, విజుబులిటి బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది.

- Advertisement -

సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు – facebook లో కోమలకి థ్యాంక్స్ చెప్పాను.మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలకి మేం ప్రామిస్ చేసినట్టు ఫిల్మ్‌లో క్రెడిట్ ఇస్తాం.డ‌బ్బు ఇస్తాం. ఆడియో ఫంక్ష‌న్ ఫిక్స్ అయితే , కోమలకి పాడమని ఇన్విటేష‌న్ పంపిస్తాం. పోస్ట్ ప్రొడక్ష‌న్‌ పనుల్లో పడి నేను టీవీల్లో జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. ఒకేసారి ఫేస్‌బుక్‌లో అందరికి ఇన్ఫ‌ర్‌మేష‌న్ ఇస్తున్నాను. థ్యాంక్స్ టూ అల్ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement