హీరో శర్వానంద్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. అతడు హీరోగా నటించి ఇటీవల విడుదలైన ‘శ్రీకారం’ మూవీ బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రానికి రూ.17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలిరోజు వచ్చిన టాక్‌తో బ్రేక్ ఈవెన్ అవుతుందని అందరూ భావించారు. కానీ రూ.17. 5 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కేవలం 9.64 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా రూ,7.86 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది. దాదాపు అన్ని చోట్ల ఈ మూవీకి బిజినెస్ ముగిసింది. ఏరియాల వారీగా ‘శ్రీకారం’ కలెక్షన్ల వివరాలు… నైజాం: రూ.2.86 కోట్లు, సీడెడ్: రూ.1.66 కోట్లు, ఉత్తరాంధ్ర: రూ.1.21 కోట్లు, తూ.గో.: రూ.74 లక్షలు, ప.గో.: రూ.50 లక్షలు, గుంటూరు: రూ.99 లక్షలు, కృష్ణా: రూ.53 లక్షలు, నెల్లూరు: రూ.32 లక్షలు, రెస్టాఫ్ ఇండియా: రూ.30 లక్షలు, ఓవర్సీస్: రూ.52 లక్షలు. కాగా శర్వానంద్‌కు ఇది వరుసగా 4వ డిజాస్టర్. గత సినిమాలు జాను, రణరంగం, పడిపడి లేచే మనసు కూడా డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే.
శర్వానంద్ కెరీర్లో డిజాస్టర్‌గా ‘శ్రీకారం’
By ramesh nalam
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement