భాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్. థియేటర్స్ లో రచ్చ లేపిన ఈ యాక్షన్ త్రిల్లర్ మూవీ.. రీసెంట్ గానే బాక్సాఫీస్ దగ్గర మాసివ్ కలెక్షన్స్ తో 1000కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఇక ఇప్పటికే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక స్పై యూనివర్స్ అని మేకర్స్ వెల్లడించారు. కాగా, ఈ స్పై యూనివర్స్ కి సంబందించిన ఈ హీరోలు మరో సారి తెరపై కలిసి కనిపించనున్నట్టు తెలుస్తోంది. పఠాన్ సినిమాలో సల్మాన్‌ఖాన్ సర్ ప్రైజ్ ఎంట్రీ ప్రేక్షకుల్లో మాస్ హైప్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వంతు.. సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’. ఈ సినిమాలో తన ప్రత్యేక అతిధి పాత్రను చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
YRF స్పై యూనివర్స్ కోసం త్వరలో షారుఖ్ ఖాన్ ‘టైగర్ 3’ షూటింగ్లో పాల్గొంటారు. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న టైగర్ 3 లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఏప్రిల్ నెల చివరి నాటికి టైగర్ 3 లో తన వంతు షూటింగ్ ను పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ ముంబైలో ఉంటుందని భాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. పఠాన్ సినిమాలో.. srk తో సల్మాన్ తాను ఒక ముఖ్యమైన మిషన్‌కు వెళుతున్నానని చెప్పాడు, దీని బట్టి ఈ మిషన్ కి సంబందించిన ఏదో విషయంలో పఠాన్ టైగర్ని కలుస్తాడు అని అర్థమవుతుంది.
టైగర్ 3లో పఠాన్ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉండబోతుందని.. థియేటర్లలో ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందించే విధంగా ఎన్నో ట్విస్ట్ లు సర్పైజ్ లు ఉంటాయని మేకర్స్ అంటునున్నారు. మరి ఈ ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి తెరపై మళ్లీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. పఠాన్ కంటే ముందు, SRK, సల్మాన్ ‘కరణ్ అర్జున్’, ‘కుచ్ కుచ్ హోతా హై’ అండ్ ‘హమ్ తుమ్హారే హై సనమ్’ సినిమాల్లో కలిసి పనిచేశారు. ఇక ప్రస్తుతం కింగ్ ఖాన్ చేతిలో.. దర్శకుడు అట్లీ నెక్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ , ‘జవాన్’ అండ్ రాజ్‌కుమార్ హిరానీ ‘డుంకీ’ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.