Saturday, November 23, 2024

అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూసిన.. హాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు

వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ క‌న్నుమూశారు హాలీవుడ్ యాక్టర్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఫేమ్.. నటుడు సెర్గియా కాల్డెరాన్ మరణించారు. 77 సంత్సరాల సెర్గియో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. 1945లో జన్మించిన అతడు. 1970 నుంచి తన నటన జీవితాన్ని మొదలు పెట్టారు. సినిమాలు మాత్రమే కాదు టీవీ షోల్లో పలు పాత్రలు పోషించారు. 1984లో జాన్ హస్టన్ దర్శకత్వం వహించిన అండర్ ది వాల్కనో, టీవీషో ది ఎ-టీమ్, కామెడీ సిరీస్ ‘ది ఇన్-లాస్’లో నటించారు. ఇలా హాలీవుడ్ లో చాలా సినిమాల్లో.. వెబ్ సిరీస్ లలో.. నటించి మెప్పించారు.

గత ఏడాడది ఎఫ్ఎక్స్ సిరీస్ బెటర్ థింగ్స్ చివరి సీజన్‌లో కూడా కనిపించారు. అతనికి భార్య, కొడుకు తో పాటు ముగ్గురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత కష్టపడ్డా.. సెర్గియో కు మంచి పేరు తీసుకువచ్చింది మాత్రం మెన్ ఇన్ బ్లాక్, పైరేట్స్ ఆఫ్ ద కరేమియన్. ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్- ఎట్ వరల్డ్స్ ఎండ్ సినిమాలు మాత్రమే.ఆ సినిమాలో పైరేట్ లార్డ్స్‌లో ఒకరైన అడ్రియాటిక్ సముద్రానికి చెందిన కెప్టెన్ ఎడ్వర్డో విల్లాన్యువా పాత్రను కాల్డెరన్ పోషించారు. ఈసినిమా తో పాటు ఆయన ఎన్నో సినిమాల్లో తన మార్క్ చూపిస్తూ.. హాలీవుడ్ స్టార్ గా ఎదిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement