ప్రముఖ సినీ నటి జయచిత్ర కుమారుడు అమరేశ్ గణేషన్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకు చెందిన ఓ వ్యాపార వేత్తను రైస్ పుల్లింగ్ పేరుతో 26.2 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వద్ద ఆలయానికి చెందిన కలశం ఉందని దానిని ఇరేడియం తో తయారు చేశారని ఆ కలశం బియ్యాన్ని ఆకర్షిస్తుందని అమరేష్ నమ్మబలికాడు.
మూడేళ్ల నుంచి సదరు వ్యక్తి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నాడు. కానీ కలశం మాత్రం ఇవ్వకపోవడంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అమరేష్ ను అరెస్ట్ చేశారు. దీనితో కొడుకును అరెస్ట్ చెయ్యడం తో నటి జయచిత్ర పేరు కూడా వార్తల్లో నిలిచింది. జయచిత్ర సుమారు 200 చిత్రాలలో నటించారు.