సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మీటు ఉద్యమం పేరుతో ఈ క్యాస్టింగ్ కౌచ్ పై ఇండస్ట్రీలో ప్రకంపనలు కూడా లేచాయి. అయితే క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ తాజాగా స్పందించారు. అప్పట్లో కూడా అవకాశాల కోసం వేధించేవారని… అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగేవాళ్లని… అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని 25 ఏళ్లకే తల్లి పాత్రలు చేశానని తెలిపారు. అప్పట్లో అవకాశం వచ్చినా హీరోయిన్ గా రెండు సినిమాలు మాత్రమే చేశాను. అమ్మ పాత్రలు చేసిన తర్వాత ఇలాంటివి వేధింపులు ఉండవని అగ్రిమెంట్ రాస్తేనే డేట్స్ ఇచ్చేవాళ్ళమని అన్నారు.
అన్ని రంగాల్లో ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. కానీ అక్కడ మహిళలు కుటుంబ గౌరవం ను దృష్టిలో పెట్టుకుని లొంగకుండా ఉంటారు. సినిమాల్లో కూడా అలానే ఉండాలి అన్నారు. ఇద్దరికి ఇష్టం అయినప్పుడు మాత్రమే తప్పు జరుగుతుందని ఒకరిపై వైపు తప్పు ఉండదని ఆమె తెలిపారు. కానీ అవకాశాల కోసం చూసే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఇండస్ట్రీలో కష్టాలు తప్పవని చెప్పుకొచ్చారు అన్నపూర్ణ.