Tuesday, November 26, 2024

ముఖ్యమంత్రి కొడుకుతో రాజశేఖర్ కూతురు కొత్త సినిమా

సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ తమిళంలో ఓ క్రేజీ ఆఫర్ ను దక్కించుకుంది. హిందీలో సూపర్ డూపర్ హిట్ సాధించిన సందేశాత్మక చిత్రం ఆర్టికల్ 15 చిత్రం రీమేక్ లో శివాని రాజశేఖర్ కు అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాలో తమిళనాడు నూతన సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించనున్నారు. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పిస్తున్నారు.

ఇక ఇవే కాకుండా శివాని రాజశేఖర్ గృహన్ దర్శకత్వంలో డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ సినిమా చేస్తోంది. అలాగే తేజ సజ్జాతో మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement