ఆశిష్ హీరోగా, కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రముఖ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘సెల్ఫిష్’. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగి ల్ను విడుదల చేశారు. ఇది హీరో పాత్ర తాలుకా మరొక కోణం చూపుతుంది. ఈ పాటను తెలుగు, హిందీ పదాల అందమైన అల్లికతో రామజోగయ్య శాస్త్రి రాశారు. మిక్కీ జె మేయర్ చక్కని మెలోడీని స్కోర్ చేశాడు. జావేద్ అలీ పాటను అద్భుతంగా పాడారు. ఆశిష్ తన డ్యాన్స్ స్కిల్స్ చక్కగా ప్రదర్శించాడు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
పాట ఆవిష్కరణ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ” ఈ పాటని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. సెల్ఫిష్ కథ విన్నప్పుడు ఆశిష్ కు బావుంటు-ం దనిపించింది. అందరూ కష్టపడి మంచి సాంగ్ ఇచ్చారు. మేరా దిల్ ఖుష్ హువా.. నా దిల్ రైట్స్ ఈ పాటకు తీసుకున్నారు. ఓల్డ్ సిటీ- నేపథ్యంలో జరిగే ఈ కథలో హిందీ లిరిక్స్ కూడా అవసరమయ్యాయి. దానికి తగ్గట్టు-గానే కొన్ని హిందీ పదాలు కూడా వాడాం. ఇది ధూల్ పేట్ నేపథ్యంలోకి వచ్చిన తర్వాత ఓ కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాం. విజయవంతమైన సినిమా ఇవ్వ డం అంత తేలికకాదు. దసరా, విరూపాక్ష, బలగం.. ఇలా కొత్తదనంతో కొత్త దర్శకులు తీసిన చిత్రాలు ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. మాంచి టీ-మ్ తో చేస్తున్న చిత్రమిది. సినిమాని నేచురల్ గా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. అన్నారు.
ఆశిష్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం నేను, దర్శకుడు కాశీ చాలా కష్టపడ్డాం. ఇది మా ఇద్దరికీ ఒక జీవితం. ఇది మాకు లైఫ్ ఇచ్చే సినిమా. ప్రాణం పెట్టి కష్టపడ్డాం. ఇంకా షూటింగ్ జరుగుతోంది. అన్నారు.
దర్శకుడు విశాల్ కాశీ మాట్లా డుతూ నేను సుకుమార్ గారి దగ్గర పని చేశాను. ఆయనకి ఈ పాయింట్ చేపినపుడు చాలా నచ్చింది. స్కిప్ట్ర్ వర్క్ చేశాం. ఈ పాయింట్ కి రాజు గారే కరెక్ట్ అని సుకుమార్ గారు చెప్పారు. రాజు గారు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు. క్యారెక్టరైజేషన్ సెల్ఫిష్ మాస్ లవ్ స్టొరీ. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.