Monday, September 16, 2024

Seerat Kapoor | నీ అందానికి గుండె ఆగిపోయేలా ఉంది సీర‌త్….

రన్‌ రాజా రన్ సినిమాలో శర్వానంద్‌ కు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్. ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించింది. మొదటి సినిమాతోనే హిట్‌ ను సొంతం చేసుకోవడం వల్ల దశాబ్ద కాలం అయినా కూడా ఈ అమ్మడి సొంతం కంటిన్యూ అవుతోంది.

చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా ప్రతి సినిమా తో అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడు తెలుగు తో పాటు హిందీ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ బిజీ బిజీ గా కెరీర్ లో కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. హీరోయిన్ గా ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటీటీ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తూ ఉంది.

నటిగా ఎప్పుడూ బిజీగా ఉండాలని ఆశించే ఈ అమ్మడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నటిగా ప్రస్తుతం ఈ అమ్మడు తాజాగా మరోసారి అందమైన ఫోటోలు షేర్ చేసింది. మీరు ధరించగలిగే అత్యంత స్టైలిష్ విషయం విశ్వాసం.. అంటూ ఈ ఫోటోలతో పాటు మంచి సందేశాన్ని నెటిజన్స్ కి అందించింది.

ఎంతటి ఖరీదైన ఔట్ ఫిట్‌ ధరించినా, స్టైలిష్ ఔట్‌ ఫిట్‌ లో కనిపించినా కూడా మనలో విశ్వాసం అనేది లేకుంటే ఆ ఫోటోలకు అందం ఉండదు అంటూ సీరత్‌ కపూర్‌ చేసిన కామెంట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సీరత్‌ కపూర్‌ ఫేస్ లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుందని, ఆమె అదే కాన్ఫిడెన్స్ తో ముందు ముందు కొనసాగాలి అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement