Wednesday, September 18, 2024

Seerat Kapoor | క‌నువిందుగా సీర‌త్ షో…

టాలీవుడ్‌లో ‘రన్ రాజా రన్’ సినిమాతో అరంగేట్రం చేసిన సీరత్ కపూర్, మొదటి సినిమా నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, ‘భామా కలాపం’ చిత్రం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. కానీ, ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడం వల్ల అందరి దృష్టిలో పడలేదు. ప్రస్తుతం సీరత్ కెరీర్ పరంగా కొత్త అవకాశాల కోసం కృషి చేస్తోంది.

అయితే, ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. బాలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించిన సీరత్, అటువైపు రెండు సినిమాల్లో నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలో, ఆమె కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నా, ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల నుంచి సీరియస్ పోటీని ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడుతుంది.

అయితే, సినిమాల్లో బిజీగా లేకపోయినా, సీరత్ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటోంది. తరచుగా తన ఫోటోలను షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌తో ఎక్కడికప్పుడు కనెక్ట్ అవుతోంది. సీరత్ షేర్ చేసిన ప్రతి ఫోటో యువతలో చర్చకు దారితీస్తోంది. ఇటీవలే అమ్మడు ఎల్లో డ్రెస్ ల్ దిగిన ఒక ఫొటో షేర్ చేసి అభిమానులను మంత్ర ముగ్దులను చేసింది.

ఆమె అందచందాలు, గ్లామర్ లుక్స్ అభిమానులను ఆకర్షిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న అమ్మడు రాబోయే రోజుల్లో మరింత గ్లామరస్ గా పాత్రలు చేయనున్నట్లు ఒక హింట్ అయితే ఇచ్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement