Saturday, July 6, 2024

Nani | “సరిపోదా శనివారం” నుండి రేపు సెకండ్ లుక్ రిలీజ్..

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “సరిపోదా శనివారం”. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ లుక్‌కి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రేపు సాయంత్రం 4:05 గంటలకు సెకండ్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

‘‘ఇప్పటి వరకు సూర్య శనివారం ఎలా ఉంటాడో చూశారు. మిగతా రోజులు ఎలా ఉంటాడో రేపు చూడనున్నారు అని మేకర్స్ తెలిపారు’’. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్‌జె సూర్య, సాయికుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. మాటపడా శనివారం సినిమా ఆగస్టు 29, 2024న ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement