Friday, October 18, 2024

#SDT18 | సాయి ధ‌ర్మ్ తేజ్ లుక్ అదిరింది…

మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల లైనప్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ప్రత్యేకమైన కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.

రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్బంగా ఓ స్పెషల్ వీడియోను వదిలారు..

ఆ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. జనాల్లో ఈ మూవీ పై అంచనాలను పెంచేందుకు తాజాగా మేకర్స్ సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్బంగా సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో యుద్దానికి సంబందించిన వాతావరణం కనిపిస్తుంది.

పురాతనమైన ప్రాంతానికి సంబందించిన కథగా తెలుస్తుంది. ఈ వీడియోలోని బ్యాగ్రౌండ్ చూస్తుంటే సినిమాలో హీరో యోధుడి పాత్రలో కనిపించునున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఈ విజువల్స్ చూస్తుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. కథ కాస్త కొత్తగా గతంలో ఎవ్వరూ చూపించని విధంగా ఉందని తెలుస్తుంది.. ఇక ఈ బీజిఏం సౌండ్ కు థియేటర్లు దద్దరిల్లుతాయని తెలుస్తుంది.. యాక్షన్ సీన్లతో సినిమా అదిరిపోతుందని మెగా ఫ్యాన్స్ వీడియోను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement