లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా థియేటర్లు మళ్ళీ ఓపెన్ అయ్యాయి. మొదటగా సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విషయానికి వస్తే… నేరం చేసిన నిందితులను ఒక అవినీతి పోలీస్ అధికారి కేసును పక్కదోవ పట్టించి ఒక అమాయక వ్యక్తిని ఇరికిస్తాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత లాయర్ రామచంద్ర గా సత్యదేవ్ కేసును రీ ఓపెన్ చేసి నిజాలను బయటకు తీసుకు వస్తాడు.
నిందితులకు శిక్ష పడేలా చేస్తాడు. ఈ సినిమా కథ మొత్తం ఎలా నిందితులకు శిక్షపడేలా ఎలా చేశాడు, అసలు నిజం ఏంటి అనేదాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ కొంత డిఫరెంట్ గా చూపించారు దర్శకుడు. సినిమా మొదటి లో కాస్త స్లోగా అనిపించినప్పటికీ ఆ తర్వాత బాగా కనెక్ట్ అవుతుంది.
దర్శకత్వం వహించడం లో శరన్‌ను ప్రశంసించొచ్చు. అలాగే సంగీతం కూడా పర్వాలేదనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమా ఆద్యంతం కూడా ముందుకు నడుస్తుంది. ఓవరాల్ గా ఓ మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే చెప్పాలి.