వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్‌జె సూర్య విలన్‌గా నటించాడు. కాగా, ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తొలిరోజు 24 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ…. మూడు రోజుల్లో 52 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
మరోవైపు అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి 2 మిలియన్ డాలర్లకు చేరువవుతుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 90 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మరి ఈ సినిమాతోనైనా నాని దసరా రికార్డును బ్రేక్ చేస్తాడో లేక కనీసం బ్రేక్ ఈవెన్ చేస్తాడో చూడాలి.