టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంక్రాంత్రి అతి పెద్ద సీజన్. ఆ సమయంలో సినిమా రిలీజ్ చేస్తే యావరెజ్ సినిమా కూడా బంపర్ కలెక్షన్లు సాధిస్తుంది. అదే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే.. అందుకే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి సంక్రాంతికి అరడజను సినిమాలు రేసులోకి వస్తాయి. అయితే ఈ సారి మాత్రం సంక్రాంతి రేసు ఉత్కంఠను రెకెత్తిస్తోంది. ఏకంగా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలా సినిమాలు వరుసగా రిలీజ్ అవనున్నాయి. టాప్ హీరోలు ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో నిలవనుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్టు శనివారం ఫస్ట్ లుక్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ఇక ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని జనవరి 14న తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్లో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందని ఇప్పటికే ప్రకటించారు.అయితే విడుదల తేది ప్రకటించలేదు.జనవరి12న లేదంటే 15న ఈ చిత్రం విడుదల అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పోటాపోటీగా సంక్రాంతి కోసం బరిలో దిగుతుంటే ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ – యువహీరో వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ చిత్రాన్ని కూడా సంక్రాంతి కి తీసుకురావాలని చూస్తున్నారు. అంతేకాదు తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న బీస్ట్ మూవీని సంక్రాతికే డేట్ ఫిక్స్ చేశారు.. 2022 పండక్కి మాత్రం అన్నీ పెద్ద సినిమాలే వస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ మాములుగా ఉండదని అర్ధమవుతుంది.
ఇది కూడా చదవండి: జడ్జీ హత్య కేసు సీబీఐకి అప్పగింత!