Friday, September 20, 2024

Samyuktha menon | విల్లు పట్టిన సంయుక్త‌…

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న “స్వయంభూ” చిత్రంలో సంయుక్త ఊహించని లుక్ లో కనిపించబోతోంది. ఈ సినిమా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతుండగా, హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు 20వ సినిమా కావడం విశేషం. ఇక సంయుక్త పాత్ర బలమైన వారియర్ గా ధైర్యంగా కనిపిస్తుండటంతో ఒక్కసారిగా ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకుముందు ఆమె ఇలాంటి పాత్రల్లో కనిపించలేదు ఇందులో అమ్మడు అద్భుతమైన యోధురాలిగా విల్లు, బాణాలతో సన్నద్ధంగా కనిపిస్తోంది. పోస్టర్‌లో ఆమె గంభీరమైన లుక్, వెనుక రంగంలో వేరే యుద్ధ దృశ్యాలు హైలెట్ అవుతున్నాయి.

ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా సమ్యుక్త, నభా నటేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం యుద్ధ నేపథ్యంతో ఉంటుందట.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌లో భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ స్వయంభూకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, కె కె సెంథిల్ కుమార్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement