Friday, September 20, 2024

Kalki | మూవీ క‌లెక్ష‌న్ కంటే ఆ డ‌బ్బులే ఎక్కువ !!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి2898 AD. ఎన్నో అంచనాల నడుమ జూన్ 27 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డు కలక్షన్స్ రాబడుతుంది. ఇప్పటివరకు కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల మార్క్‌ ను దాటేసింది.

ఇక ఇదంతా పక్కన పడితే.. కల్కి సినిమా వలన థియేటర్ యాజమాన్యం కోట్లు సంపాదించుకున్నారు. వారికి టికెట్స్ తో వచ్చిన లాభం కంటే సమోసాలు అమ్మడం వలన వచ్చిన లాభమే ఎక్కువ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒక్కో థియేటర్ లో కల్కి సినిమా పుణ్యమా అని 1 కోటి బిజినెస్ అయ్యిందని సమాచారం. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లు అయినా ఏషియన్, పీవీఆర్ లు అయితే ఏకంగా 60 శాతం లాభాలు ఫుడ్ మీదనే వచ్చాయి.

పీవీఆర్ ఇప్పటివరకు ఈ ఫుడ్ వలనే రూ. 150 కోట్లు.. ఏషియన్ రూ.50 కోట్లు సంపాదించిందని టాక్ నడుస్తోంది. అందులో టికెట్స్ వలన వచ్చింది 40 శాతం మాత్రమే. మిగతా 60 శాతం సమోసాలు వలన వచ్చిందే. నమ్మబుద్ది కావడం లేదు కదా. సాధారణంగా.. బయట తినే ఫుడ్ కన్నా మల్టిఫ్లెక్స్ లో ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ.

కల్కి సినిమాకు కుటుంబాలతో సహా రావడంతో.. విరామ సమయంలో స్నాక్స్ రేటును పెంచేసి అమ్మడం, బయటకు వెళ్లి తినే అప్షన్ లేకపోవడంతో వేరే గత్యంతరం లేక అక్కడే ఎంతరేటు అయినా తీసుకుంటున్నారు. సినిమా టికెట్ రేటు కన్నా.. అక్కడ తినే ఫుడ్ కే రేటు ఎక్కువ. అందుకే.. టికెట్స్ వలన మల్టిఫ్లెక్స్ లకు వచ్చే లాభాల కన్నా ఫుడ్ వలన వచ్చే లాభాలే ఎక్కువ. ఈ విషయం తెలియడంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement