Wednesday, November 20, 2024

సంబురంగా క్రికెటర్​ కేల్​ రాహుల్​, అతియాశెట్టి వివాహం..

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక ఇంటి వాడు అయ్యాడు. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తోన్న బాలీవుడ్ నటి అతియా శెట్టిని ఇవ్వాల (జనవరి 23) పెళ్లి చేసుకోనున్నాడు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగేలా బాలీవుడ్ నటుడు, అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి ఏర్పాట్లు చేశాడు. ముంబైలోని తన నివాసం ఖండాలాలోని ఫామ్ హౌస్ జహన్ లో వీరి వివాహం మహా సంబురంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలో ‘నో ఫోన్ పాలసీ’ అమలు చేసినట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా సునీల్ శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక పెళ్లి అనంతరం ముంబై వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ చేయనున్నారు. దాదాపు 3 వేల మంది అతిథులతో ఈ రిసెప్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం టి20 సిరీస్ ఆడుతుంది. పెళ్లి కారణంగా రాహుల్ ఈ రెండు సిరీస్ లకు దూరంగా ఉన్నాడు. అయితే ఫ్రిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement