Saturday, June 29, 2024

Samantha | మాలీవుడ్ వైపు స‌మంత అడుగులు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, హెల్త్ అప్‌డేట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా, సమంత తన కొత్త ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా అనౌన్స్ చేసింది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ కాలేదని టాక్. త్వరలోనే ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా ఉంటున్నాయి. రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలలో ఒకటి మరింత ట్రెండ్ అవుతోంది. అద్దం ముందు నిలుచొని ఫొటో దిగిన సామ్ చిన్న నిక్కరులో అందంగా కనిపించింది. అలాగే కాస్త సన్నబడినట్లు తెలుస్తోంది. ఆమె ఫిట్నెస్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో ఈ ఫొటో చెబుతోంది.

ఇక తొలిసారిగా సమంత వెబ్ సిరీస్ “సిటాడెల్: హనీ బన్నీ” లో నటించింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత సమంత మరో ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశముందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు, సమంత మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement