సినీ సెలబ్రిటీలు వారు వాడే డ్రెస్సుల దగ్గర నుండి వేసుకునే జ్యూయలరీ వరకు ప్రతీది ఎంతో ఖరీదైనవిగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాగా సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం లండన్ వెళ్లింది స్టార్ హీరోయిన్ సమంత. అక్కడ ఖరీదైన డ్రెస్ తో .. జువెలరీతో మెరిసింది. సమంత బ్లాక్ స్కర్ట్ ధరించింది .. అయితే ఇది సాధారణమైంది కాదు. విక్టోరియా బెక్ హామ్ క్రేవిచ్ ప్యాచ్ వర్క్ తో కూడినది. చేప ఆకృతిలోని ఈ స్కర్టు ధర 65 వేలు అని తెలుస్తోంది. ఇక ఈ డ్రెస్ పై ఆమె బల్గారి డైమండ్ జువెలరీని ధరించింది. సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ వాటి ధర ఆశ్ఛర్యపోయేలా చేస్తుంది. సమంత ధరించిన స్నేక్ నెక్ పీస్ ధర 2.9 కోట్లు. ఇక చేతికి ధరించిన స్నేక్ బ్రేస్ లెట్ ధర 2.6 కోట్లు. ఖరీదైన డ్రెస్ లో … జువెలరీతో .. స్టైలీష్ లుక్ తో సమంత ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement