Tuesday, November 26, 2024

పేరు మార్పుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సమంత

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అక్కినేని సమంత పెళ్లి తర్వాత కూడా అదే జోష్ ను చూపిస్తోంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత పెళ్లి… త‌ర్వాత అక్కినేని అంటూ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్ పేరును మార్చుకుంది.

కాగా రీసెంట్‌గా అక్కినేని పేరుని తీసేసి ఎస్ అనే అక్ష‌రాన్ని మాత్ర‌మే ఉంచింది. దీనితో రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. అదే విషయమై రీసెంట్ గా సమంత స్పందించారు. తన చుట్టూ ఉన్న వివాదాల గురించి ఎప్పుడు ప‌డితే అప్పుడు మాట్లాడ‌లేన‌ని, ఇష్టం వ‌చ్చిన‌ప్పుడే మాట్లాడుతాన‌ని చెప్పిన సామ్‌.. ఎవ‌రి సొంత అభిప్రాయాలు వారివేన‌ని, త‌న‌కు కాంట్ర‌వ‌ర్సీలు గురించి మాట్లాడ‌టం న‌చ్చ‌ద‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement