Friday, September 20, 2024

MTV Hustle 3 | బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత సందడి..

బాలీవుడ్ ప్రముఖ రియాలిటీ షో ‘ఎంటీవీ హజిల్’ కొత్త సీజన్ ఇప్పుడు జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలో ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో నటి సమంత సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఎంటీవీ హజిల్ సోషల్ మీడియా పేజీలో షేర్ చేశారు. ఈ ప్రోమోలో సమంత మాట్లాడుతూ.. ‘హిప్‌హాప్‌ను ప్రమోట్ చేసే ఏకైక భారతీయ కార్యక్రమం ఇదే.’ అని కూడా అన్నారు.

ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉన్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బాద్‌షా, సమంత ఇద్దరూ కంటెస్టెంట్స్‌ని ఎంకరేజ్ చేయడం కూడా ప్రోమోలో చూడవచ్చు. ఇక, ఇటీవలే ‘సెలబ్రిటీ స్ట్రీట్’ ఆడిషన్ ర్యాప్‌తో మంచి పేరు తెచ్చుకున్న కేడెన్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. బాద్‌షా కూడా సమంతతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement