Friday, November 22, 2024

Samantha | సెకండ్ మ్యారేజ్‌పై తన ఒపీనియన్ బయటపెట్టిన సామ్ !

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్‌ హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది చెన్నై సుందరి సమంత. వైవాహిక జీవితంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రొఫెషనల్‌ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది సామ్‌. అయితే, ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి బిజినెస్ లు, ఫౌండేషన్స్ పనులు చూసుకుంటూ.. తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌ సెషన్‌లో పాల్గొన్నది. ఈ క్రమంలో ఓ ఫాలోవర్‌ను సమంతను మళ్లీ పెళ్లి గురించి అడిగింది. ఫాలోవర్ల ప్రశ్నకు సమంత చాలా కూల్‌గా, కొంచెం ఫన్‌గా సమాధానమిచ్చింది.

మొదటి పెళ్లి, రెండో పెళ్లి, మూడో పెళ్లి విషయాల్లో విడాకులు తీసుకునే వారి శాతం ఎలా ఉంటుందో గణాంకాల రూపంలో వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే.. మళ్లీ పెళ్లి అనేది అనవసర పెట్టుబడి (నవ్వుతూ) అంటూ రిప్లై ఇచ్చింది. 2023 వరకు తీసుకుంటే మొదటి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకునే వారిలో 50శాతం వరకుండగా.. రెండు, మూడో పెళ్లిళ్లలో విడాకులు తీసుకునే వారి (స్త్రీలు, పురుషులు) శాతం 67 శాతం, 73 శాతంగా ఉందని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement