Sunday, November 24, 2024

శాకుంత‌లం నేటి త‌రం అమ్మాయిల‌కు క‌నెక్ట్ అవుతుంది…

సమంత టైటిల్‌ పాత్రలో నటిస్తున్న పౌరాణిక ప్రేమక థా చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకుడు. సమంత, దేవ్‌ మోహన్‌ జంటగా నటించారు. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకువ స్తున్న శాకుంతలం చిత్ర విశేషాలు వెల్లడించేందుకు గుణశేఖర్‌, సమంత, చిత్ర సమర్పకులు మీడియా సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సం దర్భంగా పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలిచ్చా రు

శకుంతల పాత్రకు ఎంత వరకు రిలేట్‌ అయ్యారు?
శాకుంతలం కథ గురించి నాకు కొంచెం తెలుసు. పూర్తి వివరాలు తెలియవు. ఇది ఐదవ శతాబ్దంలో రాసిన కథ. అయితే ఇప్పటి మోడ్రన్‌ అమ్మాయి అయిన నేను ఆ క్యారె క్టర్‌తో రిలేట్‌ అవుతున్నాను. శకుంతల పాత్ర నేటి అమ్మా యిలకు కనెక్ట్‌ అవుతుంది. ఈ శకుంతల పాత్ర చేయటం అనేది నటిగా నాకు ఓ పెద్ద బాధ్యత. దాంతో ముందు నేను భయపడ్డాను. అందుకనే గుణ శేఖర్‌గారు అడగ్గానే నో చెప్పా ను. నేను అప్పుడే రాజీ పాత్ర చేసి వచ్చాను. ఇప్పుడు చేసే శకుంతల పాత్రలో చాలా అందంగా కనిపించాలి. ప్రతీ ఫ్రేమ్‌ లో అందంతో పాత్రలో ఓ డిగ్నిటీ-, గ్రేస్‌ కనపడాలి. నేను ఆ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటు-న్నాను. అందుకు కారణం నా దర్శకుడు, నిర్మాత నా నటనపై సంతృప్తిగా ఉన్నారు.
ఇప్పటి పరిస్థితులకు శాకుంతలం ఏ మేరకు కనెక్ట్‌ అవుతుంది?
శకుంతల, దుష్యంతుడితో ప్రేమలో పడుతుంది. అ ప్పటి సమాజానికి విరుద్ధంగా ఆమె వెళుతుంది. సమాజం లో ఆమె పాత్ర కోసం ఆమె పోరాడుతుంది. ఓటమిని అస్సలు ఒప్పుకోదు. నాకు తెలిసి ఆమె ఫస్ట్‌ సింగిల్‌ మదర్‌. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి మహిళల్లో చాలా మందికి ఆమె పాత్ర కనెక్టింగ్‌ అనే చెప్పాలి.
ఒకప్పుడు అమాయకంగా ఉన్న మీకు, ఇప్పుడు ధైర్యంగా సమస్యలపై పోరాడేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
హీరోయిన్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు లేవు. దాంతో సంతోషంగా ఉన్నాను. అయితే ఈ ప్రయాణంలో నేను ఎదుర్కొన్న సమస్యల వల్ల ఇప్పడిలా మారిపోయాను. సాధారణంగా సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా అందరూ మారుతారు. నేనేమీ స్పెషల్‌ ఏమీ కాదు.
శకుంతల పాత్ర కోసం ఎలాంటి రెఫరెన్స్‌లు తీసు కున్నారు?
గుణ శేఖర్‌గారు నాకు శాకుంతలం కథ నెరేట్‌ చేసిన తర్వాత ఎలాంటి మైథిలాజికల్‌ మూవీస్‌ చూడొద్దని చెప్పా రు. అందుకు కారణం.. ఆయన మైండ్‌లో శకుంతల పాత్ర గురించి క్లియర్‌ కట్‌ ఐడియా ఉంది.
త్రీడీలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు ఎలా అని పించింది?
నేను కొచ్చిలో శాకుంతలం త్రీడీ -టైలర్‌ చూసి షాక య్యాను. అలా నోరెళ్ల బెట్టేశాను. చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. అవతార్‌లాంటి సినిమాలను త్రీడీలో చూసినప్పుడు మనం ఆ ప్రపంచంలో పిల్లల్లాగా మారిపోతాం. అలాంటి మ్యా జికల్‌ ప్రపంచానికి గుణ శేఖర్‌గారు శాకుంతలంకోసం క్రియేట్‌ చేశారు.
ఈ సినిమాలో ఒరిజినల్‌ నగలను ఉపయోగించారు కదా.. వాటిని ఏ మేరకు ఉపయోగించారు?
ఈ ప్రశ్నకు గుణ శేఖర్‌ మాట్లాడుతూ ..ఈ సినిమాలో సమంత రాణిగా కనిపించేది తక్కువ సేపే. అయినా మేం ఆభరణాలను ఎలా ఉపయోగించామనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
శాకుంతలం నిర్మాణంలో భాగం కావటానికి కారణమేంటి?
దిల్‌ రాజు మాట్లాడుతూ .. నేను నిర్మాతగా 50 సినిమా లు చేశాను. ప్రొడ్యూసర్‌గా 70 శాతం సక్సెస్‌ రేట్‌ ఉంది. ఇన్ని సినిమాలు చేసిన నేను ఇలాంటి డిఫరెంట్‌ సినిమా కూడా చేయాలనే ఉద్దేశంతో ఇందులో పార్ట్‌ అయ్యాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement