రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమా హీరోయిన్ సలోని కొత్త సినిమా ను ప్రారంభించింది. ర్యాలీ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజుకు నచ్చిందే రంభ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో రావత్ హీరోగా సలోని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కాగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పాటలను చంద్రబోస్ రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారట. అంతేకాకుండా రఘు కుంచె సంగీతం అందించబోతున్నారని త్వరలోనే రికార్డింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.