బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన శరీరాకృతి చూసి కండల వీరుడు అంటూ అభిమానులు పిలుస్తా రు. దక్షిణాది ప్రేక్షకులకు కూడా సుపరిచుతుడైన బాలీవుడ్ హీరో ల్లో సల్మాన్ మొదటి స్థానంలో ఉంటారు. అందుకే చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ప్రత్యేక పాత్ర వేయించారు. 57 ఏళ్ల వయస్సులో కూడా ఫిజిక్ మెయింటెన్ చేస్తూ కుర్రహీరో లకు సవాల్ విసురుతున్నారు. సల్మాన్‌ది సుదీర్ఘ సినీ ప్రస్థానం. 34 ఏళ్లుగా ఆయన నటిస్తూనే ఉన్నారు.
కరోన తర్వాత బాలీవుడ్ వరుస అపజయాల్లో మునిగింది. అదే సమయంలో మన తెలుగు సినిమాలు బాగా ఆడుతూ ఉత్సాహం కలిగించాయి. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్ ‘ చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించింది. ఏకంగా వెయ్యికోట్లు కొల్లగొట్టి కొత్త రికార్డ్ నెలకొల్పింది.
‘పఠాన్’ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన సినిమా ‘కిసికే జాన్ కిసికా బాయ్’ విడుదలైంది. అంచనాలు అధికం. పైగా సల్మాన్ నటిస్తూ నిర్మించిన చిత్రం 150 కోట్ల బడ్జెట్‌తో తీశారు. పూజా హెగ్డే నాయిక. అయితేనేమి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడి ఆశ్చర్యపరిచింది. వారం మొత్తం కలిసినా వంద కోట్లు వసూలు చేయలేకపోవడం గమనార్హం. ఈ సినిమాకు బ్రేక్ ఇవెన్ రావడం కష్టమే అని సినీ పండితులు అంటున్నారు. ఇలాంటి ఫ్లాప్ సల్మాన్ ఊహించి ఉండరు. ఇకపోతే ఆయన ప్రస్తుతం ‘టైగర్ జిందా హై’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే మళ్లి పూర్వవైభవం వస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.