బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ మోకాలికి, భుజాలకి గాయం జరిగినట్లు సమాచారం. దీంతో ఆయన సర్జరీ కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో (జనవరి 22న) అడ్మిట్ అయ్యినట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఇక ఈ వార్త తెలుసుకున్న సైఫ్ అలీఖాన్ అభిమానులు.. తాను త్వరగా కోలుకొని తిరిగి రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నరు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో రావణుడి పాత్రలో కనిపించారు. ఇక, ఇప్పుడు దేవరతో టాలీవుడ్‌కి డెబ్యూట్ ఇవ్వబోతున్నారు.