Saturday, November 23, 2024

నా జీవితం అన్నీ స‌వాళ్ల‌తోనే నిండింది….సాయి ధ‌ర్మ్ తేజ్

సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం విరూపాక్ష. సంయుక్తమీనన్‌ కథానాయిక. కార్తీక్‌ దండు దర్శకుడు. బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

నాకు వయసు పెరిగింది. మెచ్యూరిటీ- కూడా పెరిగింది. అందరితో నవ్వుతూ సర దాగా ఉండాలని అనుకుంటున్నా. సినిమా సక్సెస్‌ అయితే అందరం హ్యాపీగా ఉం టాం. రికార్డ్స్‌ బద్దాలు కొట్టాలని అనుకోను. ఎందుకంటే ప్రతీ వారం ఓ రికార్డ్‌ బ్రేక్‌ అవు తూనే ఉంటుంది. రికార్డులంటేనే బ్రేక్‌ అవుతుంటాయి.
విరూపాక్ష కథ 80, 90వ దశకంలో ఉంటు-ంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు ఏమి టి? ఆ ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే విరూపాక్ష అని -టైటిల్‌ పెట్టాం.
నేను తొలిసారి ఇలాంటి కొత్త జానర్‌ చేశా. నేను ఇంతకు ముందు జీవించాను. కానీ ఇప్పుడు మాత్రం నటించాను. ప్రతీ ఒక్క హీరోకి ప్రతీ సినిమా మొదటి సినిమాలానే ఉంటు-ంది. అలానే కష్టపడతారు.
ఈ సినిమాను కాంతారాతో పోల్చను. అది కల్ట్‌ క్లాసిక్‌ సినిమా. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు.
హారర్‌ సినిమాలు చూడటం వేరు. నటించడం వేరు.
నేను చేతబడిని నమ్మను. కానీ ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను.
80, 90వ దశకంలోని కథ కాబట్టి.. అప్పట్లో ప్రేమలు ఎలా ఉండేవో తెలుసుకు న్నాను. అవన్నీ రీసెర్చ్‌ చేశాం. సెట్‌లో నాకు అందరూ సపోర్ట్‌ చేశారు. అన్ని భయాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలనేది నేను నమ్ముతాను.
వర్క్‌ షాప్స్‌ చేసిన సమయంలో నా పరిస్థితి ఏమీ బాగా లేదు. నేను చేయలేని పరిస్థి తుల్లో ఉంటే కూడా అడ్జస్ట్‌ అయ్యేవారు. మా నిర్మాతలు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు.
నా జీవితం అన్నీ సవాళ్లతోనే నిండింది. నేను ఎప్పుడూ కొత్త సవాళ్లని స్వీకరించేం దుకు సిద్దంగానే ఉంటాను. అయినా సవాళ్లనేవి లేకుంటే జీవితం చప్పగా అనిపిస్తుంది.
నిర్మాత ప్రసాద్‌ గారు, బాపీ అన్న నాకు ముందు నుంచీ తెలుసు. ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచి వారు నాకు తెలుసు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయనలో నాకు అదే ఇష్టం.
జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్‌ తరువాత చిరంజీవి గారు ఓ కొటేషన్‌ పంపించారు. ”ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి” అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్‌ను పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement