Friday, November 22, 2024

Movie Review : శ‌బ‌రి…. సింగిల్ మ‌ద‌ర్ స్టోరి…

ఈ వారం విడుద‌లైన మూవీ లేడీ ఓరియెంటెడ్ బేస్ తో రూపొందించారు.. ప్ర‌ధాన పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టించింది. ఇది తన తొలి నాయికా ప్రాధాన్య చిత్రం. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా శ‌బరి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌థ విష‌యానికి వ‌స్తే సింగిల్ మ‌ద‌ర్ గా ఉన్న వ‌ర‌ల‌క్ష్మీ – సంజ‌న ప్రేమించిన వాడికి ప్రేమ‌కు దూర‌మై కుమార్తె నివేక్ష‌ణ‌తో క‌ల‌సి ముంబై నుంచి విశాఖ‌కు వ‌చ్చేస్తుంది.

- Advertisement -

అక్క‌డ‌ తన కాలేజీ మిత్రుడు, న్యాయవాది అయిన రాహుల్ (శశాంక్‌)ను కలుస్తుంది. అతని రిఫరెన్స్‌తోనే ఓ కంపెనీలో జుంబా ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. ఆ తర్వాత వైజాగ్ శివార్లలోని ఓ ఇంట్లో అద్దెకు దిగుతుంది. అయితే అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో సంజనకు ఓ చిత్రమైన సమస్య ఎదురవుతుంది. సైకోగా మారిన సూర్యం (మైమ్ గోపి) అనే వ్యక్తి రియా తన బిడ్డని.. ఆ పాపను తనకు అప్పగించాలని.. లేదంటే చంపేస్తానంటూ ఆమె వెంటపడటం మొదలు పెడతాడు.

మరోవైపు అరవింద్ కూడా తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది?కూతుర్ని కాపాడుకునేందుకు సంజన ఏం చేసింది?రియా నిజంగా తన కూతురా?కాదా?సైకో సూర్యం నుంచి సంజన ప్రాణానికి వచ్చిన ముప్పేం అతనికి అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా?అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసిన సాహసోపేతమైన ప్రయాణమే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. దీన్ని దర్శకుడు ఓ సైకలాజికల్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ముస్తాబు చేసే ప్రయత్నం చేశాడు. పాత క‌థే కాని కాస్త కొత్త‌ధ‌నంగా తీశారు.
సింగిల్ మదర్‌గా సంజనా పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ సహజమైన నటనతో ఆకట్టుకుంది సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన ఆకట్టుకుంటుంది. అరవింద్‌గా గణేశ్‌ వెంకట్రామన్‌, రియాగా నివేక్షతో పాటు సినిమాలోని మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. గోపీసుందర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విజువల్స్ బాగున్నాయి. కథకు తగ్గట్లుగా నిర్మాణ విలువలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement